31, మార్చి 2009, మంగళవారం

శీర్షిక మీరే చెప్పండి

ఇది నాకు చాలా బాగా నచ్చిన ప్రకటన. ఈ మధ్యలో యూట్యూబ్ లో ఎవరో అప్‌లోడ్ చేసుంటే సేవ్ చేసుకొన్నాను.
నేను ఇక్కడ పెడుతున్నాను. దీనికి సరిపోయే శీర్షిక మీరే చెప్పండి. శీర్షిక చెప్పడం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఇలా ఉండాలని నా ఆశ. నేను కూడా ప్రయత్నిస్తున్నాను

వీడియో ఇక్కడ చూడండి.


18 కామెంట్‌లు:

  1. ఈ ప్రకటన నేను చాలా సార్లు చూసాను.. నాకు చాలా ఇస్టం.. చూడగానే ప్రతి భారతీయుడూ ఆలోచనలో పడిపోయి ఒక సారి ఆత్మపరిశిలన చేసుకుంటాడు.. కాని అంతటి తో మర్చిపోకుండా ఆ చిన్నపిల్లాడిలాగే తనవంతు కర్తవ్యం తను నిర్వర్తిస్తే మిగిలిన వారు తప్పకుండా అండగా వస్తారు .. చాలా మంచి పోస్ట్ అండి

    రిప్లయితొలగించండి
  2. నేస్తం :) ధన్యవాదాలు.
    నేను కోరుకొనేది కూడా అదే అండీ. అందరూ తాము చేయాల్సిన దానిని సరిగ్గా చేయగలిగినపుడు ఇంక వాళ్ళు అది చేయలేదు, వీళ్ళు ఇది చేయలేదు అని ఆలోచించాల్సిన అవసరం ఉండదనుకొంటాను. ఈ ప్రకటన నచ్చని వాళ్ళు అరుదు. అలాగే దాన్ని ఆచరించేవాళ్ళు కూడా అరుదు అనే అనుకొంటాను(నేను కూడా). అందుకే ప్రయత్నిస్తున్నాను అలా జీవించటానికి. అందరం ప్రయత్నిద్దాం

    రిప్లయితొలగించండి
  3. INDIA AT A GLANCE

    ఈ శీర్షిక సరి పొతుందేమో.

    మొత్తం మన దేశాన్ని, దేశ పరిస్థితిని రెండు నిముషాలలో చూపించారు.

    ఆ చిన్న పిల్లవాడిలో మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ కనపడుతున్నాడా?

    రిప్లయితొలగించండి
  4. బోనగిరి గారు, శీర్షిక చెప్పినందుకు ధన్యవాదాలు.
    కానీ ఆ శీర్షిక ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది అని చెప్పడానికి బాగుంటుంది. కానీ మనం మారాలి, ఆ పిల్లవాడి లాగ అందరూ ఆలోచించాలి అనే చైతన్యం కలిగించే శీర్షిక కావాలండీ...

    anyways thank u so much for giving a title, and for visiting my blog :)

    రిప్లయితొలగించండి
  5. A small step to a great journey

    ఓ చిన్ని అడుగు..మహాప్రస్ధానానము వైపుకు

    రిప్లయితొలగించండి
  6. ఓ బుల్లి అడుగు..అభ్యుదయము వైపుకు

    రిప్లయితొలగించండి
  7. అఙాత గారూ ధన్యవాదాలు.
    మంచి శీర్షిక చెప్పారు,మీ పేరు రాసి ఉండచ్చు కదండీ..!!

    సురేష్ గారూ,
    మీ టపా "ఆగండి.. ఆలోచించండి... ఓటెయ్యండి" చదివాను.
    http://naazaada.wordpress.com/2009/03/30/%E0%B0%86%E0%B0%97%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%86%E0%B0%B2%E0%B1%8B%E0%B0%9A%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%93%E0%B0%9F%E0%B1%86%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF/
    మీరు చెప్పిన సంభాషణ చాలా సార్లు విన్నాను నిజ జీవితంలో. అందరికీ ఆయన విధానాలు నచ్చుతున్నాయి, కానీ ఓటు వేయడానికి ముందుకు రావటం లేదు. ఎందుకు అంటే కారణం ఆయన గెలవడు అని చెప్తారు. ఈ చెట్టు కదలదు అని ఆ పిల్లవాడు ఆలోచించి ఉంటే ఆ సమస్య అంత త్వరగా తీరి ఉండేదా??

    రాజకీయాలను పక్కన పెడితే.. ఎవరు గెలిచినా, అధికారంలోకి వచ్చినా అది తరువాత విషయం, మనం చైతన్యవంతులమవుదాం, మన సమస్యల పరిష్కారానికి మనమే ముందడుగేద్దాం. ఎవరో వచ్చి చేయాలి అనే మనస్తత్వాన్ని మార్చుకొందాం. already ఆ మనస్తత్వంలో నుండి బయట పడిన వారికి నా వందనాలు. ఎందుకంటే అది సాధించడం కొంచెం కష్టమైన పని నా అభిప్రాయం. కానీ అసాధ్యం మాత్రం కాదు. కొద్ది ప్రయత్నంతోనే దాన్ని చేరుకోవచ్చు. ఆ ప్రయత్నాన్ని ఆచరణలో ప్రారంభించడం మాత్రమే కష్టం, కానీ ఒక్క సారి దానిలో విజయం సాధిస్తే తరువాత మారమన్నా మారరు :) కావాలంటే చేసి చూడండి

    రిప్లయితొలగించండి
  8. పిచ్చబ్బాయ్!

    అల్లరే కాదు ఆలోచన నిండిన హృదయం నీది. అందుకే అంటారు పిచ్చివాళ్ళంతా మేధావులని. ఇక శీర్షిక పేరంటారా "మరో అంకురం" కావచ్చేమో. ఎమదుకంటే నేను మీ అంతటి మేధావిని కాదు కాబట్టి. ఏమటారు. :)

    రిప్లయితొలగించండి
  9. పిచ్చోడుగారూ! మీకు ఆలోచనెక్కువ.

    అవునూ! మరి ఇంతమందిలో మారాలనే ఆలోచన ఉన్నప్పుడు ఆ మార్పుకోసం మనమే మన వంతు ప్రయత్నమ్ ఎందుకు చెయ్యకూడదు?

    రిప్లయితొలగించండి
  10. నిజమే అఙాత గారూ, ప్రతి ఒక్కరికీ మారాలనే కోరిక ఉంటుంది. కానీ ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి బిడియం, అహంకారం లాంటి కొన్ని ఫీలింగ్స్ ముందుకు పోకుండా ఆపేస్తుంటాయి. వాటిని దాటి ముందుకు వెళ్ళి ఆ ఆలోచనను ఆచరణలోకి తీసుకొని రావాలి. ( నాకు స్వయంగా అనుభవం కాబట్టి నేను చెప్పింది సరైనదనే అనుకొంటున్నాను)

    రిప్లయితొలగించండి
  11. కానీ ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి బిడియం, అహంకారం లాంటి కొన్ని ఫీలింగ్స్ ముందుకు పోకుండా ఆపేస్తుంటాయి నిజం చెప్పారండి మీ ఆలోచనలు చాలా బాగున్నాయి మీరు post చేసిన video great very very great దానిని ఇప్పుడే download చేసాను నా mobile లో వుంచాను అజ్ఞాత గారు చెప్పినట్టు పిచ్చోలంతా మేదావులేనేమో మీ ఇరువురికి ధన్యవాదాలండి

    రిప్లయితొలగించండి
  12. శ్రీ గారు, ఆ వీడియో నేను కుడా యూట్యూబ్ నుండి తెచ్చుకొన్నానండీ :)
    మేధావులంతా పిచ్చోళ్ళు అనిపించుకొంటారు కానీ,,, పిచ్చోళ్ళంతా మేధావులు ఎలా అవుతారండీ?? :)చాలా తేడా ఉంది కదా

    రిప్లయితొలగించండి